Gambling Crackdown | పేకాట నిరోధానికి ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు: సీపీ సాయిచైతన్య

దీపావళి పండుగ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పేకాట నిరోధానికి ప్రత్యేకనిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Gambling Crackdown | దీపావళి పండుగ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పేకాట నిరోధానికి ప్రత్యేకనిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

Gambling Crackdown | పేకాట ఆడితే.. పేకాట స్థావరాలు నిర్వహించినా..

పండుగ సమయంలో ఎవరైనా పేకాట ఆడినా, పేకాట స్థావరాలు నిర్వహించినా ఇతరులను పేకాట ఆడేందుకు ప్రోత్సహించినా కఠినచర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు పేకాటపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఎక్కడైనా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందితే తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రజలు కూడా ఎక్కడైనా పేకాట ఆడితే పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712659700కు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ కోరారు.

ఇది కూడా చదవండి..: Indiramma Illu Diwali | ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలి

 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *