అక్షరటుడే, కామారెడ్డి: Voter Enumeration Forms | అర్హులైన ఓటర్లు నవంబర్ 21లోగా సంబంధిత బూత్‌స్థాయి అధికారులకు గణన పత్రాలు సమర్పించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ విక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.
Voter Enumeration Forms | అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు హక్కును..
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందేలా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అడిషనల్ కలెక్టర్ విక్టర్ సూచించారు. భారత ఎన్నికల సంఘం (Election Commission) ఆదేశాల మేరకు ఏఎస్‌డీడీ జాబితాలో గుర్తించబడిన ఓటర్లకు తుది ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చుకునేందుకు మరో అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు జారీ చేసినప్పటికీ గైర్హాజరైనవారు, నివాసం మారినవారు, మరణించిన వారు, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో పేర్లు నమోదైనవారు, డుప్లికేట్ ఓటర్లుగా గుర్తించబడిన వారి పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు చేసుకోలేదని తెలిపారు. సంబంధిత ఓటర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేర్లను పరిశీలించుకోవాలని సూచించారు. తుది ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చుకునేందుకు సంబంధిత బూత్ స్థాయి అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు లేదా ఎన్నికల నమోదు అధికారులను సంప్రదించి అవసరమైన గణన పత్రాలను సమర్పించాలని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Goud Community Building | గౌడ సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు