అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Water Wastage | తాగునీటితో నేలను శుభ్రం చేసిన ఓ సంస్థకు జలమండలి (HMWSSB) అధికారులు షాక్ ఇచ్చారు. రూ.20 వేల జరిమానా విధించడంతో పాటు డ్రెయినేజీ కనెక్షన్ కట్ చేశారు.
జూబ్లీహిల్స్‌లోని అక్షయ కల్ప ఫార్మ్స్ అండ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ శనివారం తమ ప్రాంగణాన్ని తాగునీటితో శుభ్రం చేసింది. ఈ విషయం అధికారుల దృష్టికి రావడంవో వెళ్లి పరిశీలించారు. ఫ్లోర్ క్లీనింగ్ కోసం తాగునీటిని వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు సదరు సంస్థకు రూ.20 వేల జరిమానా విధించారు. అంతేగాకుండా ఆ ప్రాంగణానికి ఉన్న మురుగునీటి కనెక్షన్‌ను కూడా తాత్కాలికంగా కట్ చేశారు.
Water Wastage | నీటి ఎద్దడి నివారణకు..
ఎల్‌నినో నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఇప్పుడే తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ జలాలు పడిపోయాయి. ప్రాజెక్టుల్లో నీటినిల్వలు తగ్గిపోయాయి. దీంతో జలమండలి అధికారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని నిత్యం అవగాహన కల్పిస్తున్నారు. అయినా పలువురు పట్టించుకోవడం లేదు. దీంతో అధికారులు జరిమానాలు విధిస్తున్నారు. రానున్న రోజుల్లో నీటి కొరత తీవ్రం కాకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు, వాణిజ్య సంస్థలు తాగునీటిని ప్రధానంగా తాగడం, ఇతర వంట వంటి అత్యవసర అవసరాలకు మాత్రమే కేటాయించుకోవాలని సూచించారు. నేలలను శుభ్రం చేయడానికి, వాహనాలను కడగడానికి, తోటపని, నిర్మాణ కార్యకలాపాలకు తాగునీటిని వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దీనిని కూడా చదవండి : Father Kills Son | కుమారుడిని హత్య చేసిన తండ్రి అరెస్ట్..