Ponnam Prabhakar | ఎన్నికల వరకే రాజకీయాలు : మంత్రి పొన్నం ప్రభాకర్​

ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధే లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దామని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ponnam Prabhakar | ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధే లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దామని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్​తో కలిసి సోమవారం ఉదయం ఆయన కరీంనగర్ (Karimnagar)​లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

మంత్రి పొన్నం మాట్లాడుతూ.. వ్యక్తిగత రాజకీయాలకు అతీతంగా జిల్లా అభివృద్ధి కోసం సమష్టిగా పని చేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కరీంనగర్ జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెడతామన్నారు. సాగు నీటి ప్రాజెక్ట్​లను పూర్తి చేస్తామన్నారు. విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ మేరకు నవోదయ, కేంద్రీ య విద్యాలయాల కోసం ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. మెడికల్​ కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేసి, వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

Ponnam Prabhakar | ఆలయాల అభివృద్ధి

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలోని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలను అభివృద్ధి చేస్తామని పొన్నం ప్రభాకర్​ అన్నారు. ఎలగందుల ఖిల్లాను పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు. కరీంనగర్​ నగరంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్​ రూమ్​ ఇళ్లను పూర్తి చేసి, పేదలకు అందించేందుకు కృషి చేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీలైనన్ని నిధులు తీసుకొచ్చి జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి..: Telangana New Pensions | తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. నేటి నుంచే 4.50 లక్షల మందికి కొత్త పింఛన్లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *