అక్షరటుడే, వెబ్‌డెస్క్: Travel Bus Fire | ప్రకాశం జిల్లా (Prakasam District) వలేటివారిపాలెం మండలం చుండి గ్రామం సమీపంలో సోమవారం అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
కడప నుంచి విజయవాడకు వెళ్తున్న ఈ బస్సులో అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో ముందు టైరు పేలడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కకు నిలిపి, ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు దించారు. ఆ సమయంలో బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తూ, మంటలు బస్సు మొత్తానికి వ్యాపించేలోపే ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
Travel Bus Fire | పూర్తి కాలిపోయిన బస్సు
ప్రయాణికులు దిగిపోయిన అనంతరం మంటలు బస్సు అంతటా వ్యాపించాయి. దీంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. ఈ ప్రమాదంలో నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Sana Satish Babu | ఉమ్మడి తూర్పుగోదావరిలో సానా మార్క్.. కూటమి క్లీన్ స్వీప్‌కు సాన పెట్టిన సతీష్ బాబు