Rahul Gandhi Telangana Visit | రాహుల్ గాంధీ హైదరాబాద్‌ పర్యటన ఖరారు..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీలో సమావేశమయ్యారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Rahul Gandhi Telangana Visit | కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ( Mahesh Kumar Goud )  ఢిల్లీలో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు కొనసాగిన ఈ భేటీలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంస్థాగత కార్యక్రమాలు, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరుగుతున్న పనుల నివేదికను రాహుల్ గాంధీకి అందించినట్లు మహేశ్ గౌడ్ వెల్లడించారు. ప్రధానంగా ఓబీసీ (బీసీ) సంక్షేమం, రాజకీయాల్లో వారికి దక్కాల్సిన ప్రాతినిధ్యంపై లోతుగా చర్చించినట్లు తెలిపారు.

Rahul Gandhi Telangana Visit | గిగ్ వర్కర్లతో భేటీ..

హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘భారత్ సమ్మిట్’లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ నవంబర్ 13 లేదా 14వ తేదీల్లో తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు తెలిపారు. పర్యటన సమయంలో నగరంలోని గిగ్ వర్కర్లతో (డెలివరీ, డిజిటల్ వర్కర్స్) రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలపై చర్చించనున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల భద్రత కోసం చట్టాన్ని తీసుకరాగా, వారి సంక్షేమంపై రాహుల్ మాట్లాడతారని తెలిపారు. అలాగే నగరంలో జరిగే సర్‌ వ్యతిరేక సభ, మెగా బీసీ ర్యాలీలకు కూడా రాహుల్‌ను ఆహ్వానించినట్లు వివరించారు.

Rahul Gandhi Telangana Visit | నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి..

రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న అంతర్గత విషయాలపై ఈ భేటీలో ఎలాంటి చర్చ జరగలేదని, ఆ వ్యవహారాలను కేసీ వేణుగోపాల్ చూసుకుంటారని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. అలాగే సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టులను ఈ నవంబర్ నెలలోనే భర్తీ చేస్తామని ప్రకటించారు. మరోవైపు సోనియా గాంధీ ఆత్మకథ విడుదలను స్వాగతిస్తూ, తెలంగాణలో దానిపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు వెల్లడించారు.

ఇది కూడా చదవండి:  Bank of Baroda MCLR | బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు షాక్.. భారీగా పెరిగిన లోన్ వడ్డీ రేట్లు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *