అక్షరటుడే, ఇందూరు: Induru Stadium | ఇందూరులో స్టేడియం నిర్మాణమే తమ లక్ష్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (Mla Dhanpal) తెలిపారు. ఖైసర్ అథ్లెటిక్స్ అకాడమీ ఆధ్వర్యంలో నగరంలోని రాజారాం స్టేడియంలో అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించారు.
Induru Stadium | హామీ నిలబెట్టుకోవాలి
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్టేడియం కోసం ఇప్పటికే అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు గుర్తుచేశారు. ఇందూరులో స్టేడియం నిర్మిస్తామన్న ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలని చెప్పారు. గత 10 ఏళ్లుగా నిర్విరామంగా అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. కేవలం క్రీడా పోటీలనే కాకుండా పోలీసు, ఆర్మీ ఉద్యోగాలకు శిక్షణను కూడా ఇవ్వడం గర్వించదగ్గ విషయమన్నారు.
Induru Stadium | ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో..
ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో తర్ఫీదు తీసుకోవాలన్నారు. ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం పుష్కలంగా లభిస్తుందన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే నగరానికి చెందిన హాకీ క్రీడాకారిణి ఎండల సౌందర్య, బాక్సర్లు నికత్ జరీన్, హుస్సముద్దీన్, పర్వతారోహకురాలు పూర్ణా మలావత్ కు క్రీడా కోట కింద ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో కైసర్ అకాడమీ ఫౌండర్ ఖైసర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, కరాటే రమేష్, కార్పొరేటర్లు ఎండి అన్వర్ అమర్ సింగ్, మఠం పవన్, కో ఆప్షన్ మెంబర్ సురేందర్, ఎంపీజే అబ్దుల్ అజీజ్, అడ్వకేట్ జునేద్, యూనిస్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు