అక్షరటుడే, ఎల్లారెడ్డి: Tota Sai Prasad | భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రదానం చేసే ప్రతిష్టాత్మక ఉత్కృష్ట సేవా పతకానిని తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఇంటిలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ తోట. సాయి ప్రసాద్ ఎంపికయ్యారు.2000 బ్యాచ్‌కు చెందిన తోట సాయి ప్రసాద్ 25ఏళ్లుగా పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు.
Tota Sai Prasad | అంకితభావం.. అత్యుత్తమ సేవలకు గాను..
పోలీసు శాఖలో ఆయన చూపిన అంకితభావం, అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవ పతకాన్ని ప్రకటించింది. కామారెడ్డి జిల్లా (Kamareddy District) ఎల్లారెడ్డికి చెందిన దివంగత తోట పోచయ్య (ఆర్టీసీ కండక్టర్) తోట సావిత్రి దంపతులకు ముగ్గురు సంతానం కాగా కూతురు భాగ్యలక్ష్మి ప్రైవేట్ టీచర్, రెండో సంతానం తోట సాయిప్రసాద్ ఇంటిలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్, మూడవ కుమారుడు ఏసీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ తోట లింగమూర్తి. తోట సాయిప్రసాద్ 2000లో పోలీసు శాఖకు ఎంపికయ్యారు.
Tota Sai Prasad | ఆయన విధి నిర్వహణ ప్రస్థానమిది..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో పోలీసు శిక్షణ పొందిన తోట సాయిప్రసాద్ పోలీసు సేవా యాత్ర ఇలా కొనసాగింది. తన మొదటి సర్వీసును నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో ప్రారంభించారు. అనంతరం రెండో పోస్టింగ్ కార్ఖానా, పోలీస్ స్టేషన్ సికింద్రాబాద్‌లో, మూడో పోస్టింగ్ గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సికింద్రాబాద్‌లో, నాల్గో పోస్టింగ్ ట్రాన్స్‌కో విజిలెల్స్లో పనిచేశారు. ప్రస్తుతం ఐదో పోస్టింగ్‌లో భాగంగా ఇంటెలిజెన్స్ విభాగంలో సేవలందిస్తున్నారు. ఆయన సతీమణి తోట రేణుక ప్రసాద్ ఆర్‌అండ్‌బీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా మెదక్‌లో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా సాయిప్రసాద్‌కు అవార్డు రావడంపై ఆయన కుటుంబ సభ్యులు, తోటి సిబ్బంది, 2000 బ్యాచ్ మిత్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Police Sports | క్రీడల్లో సత్తా చాటిన కామారెడ్డి పోలీసులు