అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Smart Classrooms in Schools | విద్యార్థి ప్రగతికి చదువే ఆధారంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ (Collector Garima Agrawal) పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ ఎంపీహెచ్ఎస్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాస్ రూమ్‌ను ఆమె బుధవారం ప్రారంభించారు.
Smart Classrooms in Schools | జిల్లాలో 20 పాఠశాలల్లో..
జిల్లాలోని 20 పాఠశాలల్లో ఆయా పాఠశాలల్లో ఒక గదికి రంగులు వేసి నాలుగు ఫ్యాన్లు, లైట్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్, 10 డెస్క్‌లు, యూపీఎస్‌లు కూడా ఏర్పాటు చేయించారు. జిల్లాలోని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ ఎంపీ హెచ్ఎస్, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని తారాక రామ నగర్ ఎంపీపీఎస్, తంగళ్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల, ఇల్లంతకుంట మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ , తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఆర్టీసన్ కాలనీ ఎంపీపీఎస్, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల, గంభీరావుపేట మండలం లింగన్నపేట జడ్పీ ఉన్నత పాఠశాల, గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట ఎంపీపీఎస్, ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల, ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ ఎంపీపీఎస్, ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఎంపీపీఎస్, చందుర్తి మండలం మల్యాల జడ్పీ ఉన్నత పాఠశాల, చందుర్తి మండలం సనుగుల ఎంపీపీఎస్, వేములవాడ మండలం రుద్రవరం జడ్పీ ఉన్నత పాఠశాల, వేములవాడ పట్టణంలోని ఎంపీపీఎస్, వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి ఎంపీపీఎస్, కోనరావుపేట మండలం నిజామాబాద్ ఎంపీపీఎస్, రుద్రంగి ఎంపీపీఎస్ లో ఆయా సౌకర్యాలు కల్పించారు.
Smart Classrooms in Schools | కలెక్టర్ ప్రత్యేక చొరవ, శ్రద్ధతో సౌకర్యాలు
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక చొరవ, శ్రద్ధతో జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థలు, హాస్పిటళ్లలో సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. పలు బ్యాంకుల ఆద్వర్యంలో సీఎస్ఆర్ కింద వసతులు కల్పిస్తున్నారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ కింద రూ.22 లక్షలతో విద్యార్థుల సౌకర్యార్థం 145 బెడ్స్, పరుపులు ఏర్పాటు చేయించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆధ్వర్యంలో రూ.కోటితో స్మార్ట్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేయించారు. త్వరలో జిల్లాలోని పలు ఆస్పత్రులు, అంగన్వాడీల్లో సీఎస్ఆర్ కింద వసతుల కల్పన పనులు మొదలు కానున్నాయి.
Smart Classrooms in Schools | వ్యక్తి వికాసం, అభివృద్ధికి చదువే ఆధారం..
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వ్యక్తి వికాసం, అభివృద్ధికి చదువు ఒక ఆయుధంగా ఉపయోగ పడుతుందని వివరించారు. ఎందరో ఆదర్శ వ్యక్తులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదిగారని గుర్తు చేశారు. బీఆర్ అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఏపీజే అబ్దుల్ కలాం వారి విద్యాభ్యాస కాలంలో ఎన్నో కష్టాలు పడి ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి విజయ్ సాగర్, తహశీల్దార్ మహేశ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజీవ్ కుమార్, హెచ్డీఎఫ్సీ బాధ్యులు శ్రావణ్ కుమార్, నాగేశ్వరరావు, కమలాకర్, మండల విద్యాధికారి దూస రఘుపతి, కాంప్లెక్స్ హెచ్ ఎం మోతిలాల్, ఏఏపీసీ ఛైర్పర్సన్ తిప్పవరం సుధ, హెచ్ఎం చక్రవర్తుల రమాదేవి, వార్డు కౌన్సిలర్ లింగంపల్లి భాగ్యలక్ష్మి, దొంతినేని కళ్యాణి తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Fake Certificates Scam | నకిలీల గుట్టు రట్టయ్యేనా..? కామారెడ్డిలో భారీగా నకిలీ సర్టిఫికెట్ల విక్రయం..?