ACB Raids | అక్రమాస్తులు కూడబెట్టిన ఇరిగేషన్​ డీఈఈ.. ఏసీబీ సోదాలు

నాగర్ కర్నూల్ జిల్లా ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | మరో అవినీతి తిమింగలం ఏసీబీ (ACB) వలకు చిక్కింది. తన ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన ఇరిగేషన్​ డిప్యూటీ ఇంజినీర్​ నివాసాల్లో అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు.

నాగర్ కర్నూల్ జిల్లా ఇరిగేషన్ అండ్ సీఏడీ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆయన నివాసంతో పాటు మిత్రులు, బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, నాగర్ కర్నూల్‌లోని సత్యనారాయణ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.

ACB Raids | భారీగా ఆస్తులు

సత్యనారాయణ భారీ మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఆస్తులకు సంబంధించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అంతేగాకుండా బంగారం, నగదు సీజ్​ చేశారు. సోదాలు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

దీనిని కూడా చదవండి : Shekhar Master | శేఖర్​ మాస్టర్​ కారుకు ప్రమాదం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *