Kukatpally Truck Park | ట్రక్​ పార్క్​ భూముల వేలాన్ని అడ్డుకుంటాం : హరీశ్​రావు

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని అడ్డుకుంటామని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kukatpally Truck Park | కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని అడ్డుకుంటామని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన పార్క్​ స్థలాన్ని పరిశీలించి, స్థానికులతో మాట్లాడారు.

ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంపై స్థానికులు హరీశ్​రావుకు వివరించారు. దీంతో ఆయనప మాట్లాడుతూ.. ట్రక్ పార్క్ భూముల వేలాన్ని అడ్డుకుంటామని, స్థానిక ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్​ఎస్​ అధికారంలోకి వస్తుందని తెలిపారు. పార్కు భూముల వేలంలో పాల్గొనే వారికి భవిష్యత్​లో అనుమతులు రావని హెచ్చరించారు. బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కలిసి ఎంత పెద్ద ఉద్యమమైనా చేసి ఈ భూమిని కాపాడుతామన్నారు.

Kukatpally Truck Park | భూములు అమ్మడంపైనే

రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మకానికి పెట్టారని హరీశ్​రావు విమర్శించారు. హెచ్‌సీయూ భూములను తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నారని, మియాపూర్ భూమిని కూడా అమ్మాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన కంటే భూములు అమ్మడంపైనే ఎక్కువ శ్రద్ధ ఉందని విమర్శించారు. 2013లో కూడా కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూమిని అమ్మడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. అప్పుడు కూడా సీపీఐ, సీపీఎం పార్టీలతో కలిసి బీఆర్ఎస్ పోరాటం చేసిందని గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి..: Army Vehicle Accident | చేవెళ్లలో ఆర్మీ వాహనం బోల్తా..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *