అక్షరటుడే, డిచ్పల్లి: Nizamabad Congress | కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరడం అభినందనీయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి అన్నారు. శుక్రవారం డిచ్పల్లి మండలం (Dichpalli Mandal) మిట్టపల్లి మాజీ సర్పంచ్ గణేష్, రాంపూర్ మాజీ ఎంపీటీసీ లక్ష్మి నారాయణ బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు.
Nizamabad Congress | ఐక్యంగా ఉండాలి
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని.. ఆ వాస్తవాలను గుర్తించిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుండగా.. పార్టీ నాయకులు అందరూ ఐక్యంగా ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డిచ్పల్లి మండల అధ్యక్షుడు అంబర్ సింగ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, రామచందర్ గౌడ్, తారాచంద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Limbadri Narasimha Temple | కోరిన కోరికలు తీర్చే లింబాద్రి నరసింహుడు.. 15 నుంచి గుట్టపై కార్తీక బ్రహ్మోత్సవాలు