అక్షరటుడే, కామారెడ్డి: Number Plate Violations | నంబర్ ప్లేట్ లేని వాహనాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కామారెడ్డి (Kamareddy) పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
Number Plate Violations | నిబంధనలకు విరుద్ధంగా..
ముఖ్యంగా నంబర్ ప్లేట్లు లేకుండా, నంబర్ ప్లేట్లను చెరిపివేసి, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసుకున్న వాహనాలను గుర్తించి తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్లు వినియోగించడం తదితర ఉల్లంఘనలపై మొత్తం 106 కేసులు నమోదు చేసి, 241 చలాన్లు జారీ చేశారు.
రూ.1,30,770 జరిమానా వసూలు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలకు సక్రమమైన నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు సూచించారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో కామారెడ్డి పట్టణ ఎస్‌హెచ్‌ఓ నరహరి, ట్రాఫిక్ ఎస్‌ఐ చంద్రశేఖర్ గౌడ్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: జానయ్య అంశాన్ని పక్కన పెట్టనున్నారా..!