Jewellery Robbery | తుపాకులతో బెదిరించి.. పీఎంజే జ్యువెలరీ షాపులో దోపిడీ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jewellery Robbery | కరీంనగర్​ (Karimnagar) లో కాల్పులు కలకలం రేపాయి. ఆదివారం ఉదయం ఓ బంగారు ఆభరణాల దుకాణంలోకి కొందరు దుండగులు తుపాకులతో చొరబడ్డారు. అనంతరం గాల్లోకి కాల్పులు జరిపి నగలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కరీంనగర్‌లోని కోర్టు ఆవరణలో పీఎంజే జ్యువెలరీ (PMJ Jewellery) షాపును ఉదయం సిబ్బంది తెరిచారు. కొద్దిసేపటికే ఐదుగురు దుండగులు తుపాకులతో చొరబడ్డారు. సిబ్బందిపై కాల్పులు జరిపి భయాందోళనకు గురిచేశారు. అనంతరం భారీ ఎత్తున బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. పట్టపగలే జనసంచారం ఉన్న ప్రాంతంలో ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Jewellery Robbery | సిబ్బందికి గాయాలు

దుండగుల కాల్పుల్లో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. అనంతరం నిందితులు భారీ ఎత్తున బంగారు ఆభరణాలను దోచుకుని పరారీ అయ్యారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్​ టీమ్​ ద్వారా ఆధారాలు సేకరించారు. నిందితుల కోసం సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

 

ఇది కూడా చదవండి : Hyderabad Accident | కారుతో బైకును ఢీకొట్టి.. బాధితుడిని 2 కి.మీ ఈడ్చుకెళ్లాడు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *