క్రీడలుPunjab Kings Fan | సిక్సర్‌తో గాయమైన అభిమానికి అండగా పంజాబ్ కింగ్స్.. వీడియో...

Punjab Kings Fan | సిక్సర్‌తో గాయమైన అభిమానికి అండగా పంజాబ్ కింగ్స్.. వీడియో కాల్ చేసి మ్యాచ్‌కి ఆహ్వానించిన ప్రీతి జింటా

ఐపీఎల్ మ్యాచ్‌లో సిక్సర్ తగిలి గాయపడిన 62 ఏళ్ల అభిమాని ఆరోగ్యాన్ని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం అడిగి తెలుసుకుంది. ప్రీతి జింటా, ప్రియాన్ష్ ఆర్య వీడియో కాల్ ద్వారా పరామర్శించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Punjab Kings Fan | ఐపీఎల్ 2026 సీజన్‌లో అభిమానుల పట్ల జట్ల బాధ్యతను చాటిచెప్పే ఘటన వెలుగులోకి వచ్చింది. పంజాబ్ కింగ్స్ జట్టు Punjab Kings తమ అభిమానికి అండగా నిలిచి క్రీడాస్ఫూర్తిని మరోసారి నిరూపించింది.

ఏప్రిల్ 19న న్యూ చండీగఢ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో నాలుగో ఓవర్ సమయంలో పంజాబ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య కొట్టిన సిక్సర్ స్టాండ్స్‌లో కూర్చున్న 62 ఏళ్ల కృష్ణన్ చంద్ అనే అభిమాని ముఖానికి బలంగా తగిలింది. ఈ ఘటనతో ఆయనకు తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే సిబ్బంది స్పందించి సమీప క్లినిక్‌కు తరలించారు.

Punjab Kings Fan | వీడియో కాల్ చేసిన ప్రీతి..

ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా preity zinta , ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య బాధితుడితో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఈ కాల్‌లో జట్టు క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ ఆశిష్ తులి కూడా పాల్గొన్నారు. వారు కృష్ణన్ చంద్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా, హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరగబోయే పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రావాలని వ్యక్తిగతంగా ఆహ్వానించారు. తదుపరి మ్యాచ్‌కు వస్తే భద్రత కోసం స్వయంగా హెల్మెట్ అందిస్తానని ప్రీతి జింటా హామీ ఇచ్చారు.

Punjab Kings Fan | క్రీడా వర్గాల ప్రశంసలు

ప్రస్తుతం కృష్ణన్ చంద్ Krishnan chand ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలో పూర్తిగా కోలుకుని మళ్లీ స్టేడియానికి వచ్చి మ్యాచ్‌ను ఆస్వాదిస్తారని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ఘటన పంజాబ్ కింగ్స్ జట్టు అభిమానుల పట్ల చూపుతున్న మానవత్వాన్ని, బాధ్యతను ప్రతిబింబించిందని క్రీడా వర్గాలు ప్రశంసిస్తున్నాయి. ఇక పంజాబ్ జ‌ట్టు ఇప్పుటు టేబుల్ టాప్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ సారి క‌ప్ కొట్టాల‌నే క‌సితో ఉంది.

ఇది కూడా చదవండి..: Tilak Varma Watch | షాట్‌తో పాటు వాచ్ కూడా పోయింది.. తిలక్ వర్మకు విచిత్ర అనుభవం

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

FII Investment Outflow | ఆగని పెట్టుబడుల ఉపసంహరణ.. 4 నెలల్లోనే రూ. 2.40 లక్షల కోట్ల అమ్మకాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: FII Investment Outflow | భారత స్టాక్ మార్కెట్...

Paddy Procurement Issues | ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదు..: ఎమ్మెల్యే రాకేష్​రెడ్డి

అక్షరటుడే, ఆర్మూర్​: Paddy Procurement Issues | ఆర్మూర్​ నియోజకవర్గంలో (Armoor)...

PMJ Robbery | పీఎంజే షోరూమ్‌లో సిబ్బందిని మోకాళ్లపై కూర్చోబెట్టి, భయపెట్టి.. బంగారం దోచుకెళ్లిన ముఠా!

అక్షరటేడే, వెబ్‌డెస్క్: PMJ Robbery | కరీంనగర్​ జిల్లా కేంద్రంలోని అత్యంత...