అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jupally Krishna Rao | మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులు రెండో పంట వేయొద్దన్నారు. యాసంగిలో సాగుకు కరెంట్ ఇవ్వలేని పరిస్థితులు వస్తాయన్నారు.
ప్రస్తుతం జలాశయాల్లో నీరు లేదని మంత్రి జూపల్లి అన్నారు. కాలువల ద్వారా నీటి విడుదల చేయమని స్పష్టం చేశారు. బోరుబావులు ఉన్న రైతులు (Farmers) మాత్రమే పంటలు వేసుకోవాలని సూచించారు. అదికూడా ఆరుతడి పంటలే వేయాలన్నారు. రానున్న రోజుల్లో కరెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Jupally Krishna Rao | రైతుల ఆందోళన
ఎల్‌నినోతో వర్షాలు లేక జలశయాల్లోకి నీరు రాలేదు. భూగర్భ జలాలు సైతం అడుగంటిపోయాయి. దీంతో వానాకాలంలోనే పలు ప్రాంతాల్లో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారు. యాసంగిలో సైతం పంటలు వేసే పరిస్థితి లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తాము ఎలా బతకాలని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. వ్యవసాయ అధికారులు సైతం యాసంగిలో వరి వేయొద్దని అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు కొందరు రైతులు బోరుబావుల కింద వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు.
ఇది కూడా చదవండి..: Harish Rao Criticism | అభయ హస్తం కాదు మొండి హస్తం.. కాంగ్రెస్ పాలనపై హరీశ్‌రావు విమర్శలు