Maoist Dump Seized | కర్రెగుట్టల్లో మావోయిస్ట్​ డంప్​ స్వాధీనం

తెలంగాణ–ఛత్తీస్​గఢ్​ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో పోలీసులు భారీ మావోయిస్ట్ డంప్​లను గుర్తించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Maoist Dump Seized | తెలంగాణ–ఛత్తీస్​గఢ్​ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో పోలీసులు భారీ మావోయిస్ట్ డంప్​లను గుర్తించారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) బెటాలియన్‌కు చెందిన మూడు డంపుల నుంచి 280 బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ (బీజీఎల్) షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

కర్రెగుట్టలను నక్సల్స్​ గతంలో తమ స్థావరంగా ఉపయోగించుకున్న విషయం తెలిసిందే. ఆపరేషన్​ కగార్​తో దాదాపుగా మావోయిస్టులు కనుమరుగు అయ్యారు. ఈ క్రమంలో ఇటీవల బలగాలు అడవుల్లో ప్రత్యేక సెర్చ్​ ఆపరేషన్లు చేపట్టి మావోయిస్ట్ డంప్​లను స్వాధీనం చేసుకుంటున్నాయి. తాజాగా తెలంగాణ పోలీసులు పక్కా సమాచారం మేరకు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. సింటెక్స్ వాటర్ ట్యాంక్ డ్రమ్ములలో నిల్వ ఉంచిన బీజీఎల్ షెల్స్‌తో కూడిన మూడు మావోయిస్టుల డంపులను గుర్తించారు.

Maoist Dump Seized | భవిష్యత్​ కార్యకలాపాల కోసం..

ఆపరేషన్​ కగార్​తో మావోయిస్టులు ఉనికి కోల్పోయారు. బలగాలు అడవులను జల్లెడ పట్టడంతో ఆయుధాలను దాచి పెట్టారు. భవిష్యత్ కార్యకలాపాల కోసం ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ మందుగుండు సామగ్రిని దాచడానికి దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. తమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పుడు ఈ షెల్స్‌ను తిరిగి తీసుకోవాలని వారు పథకం వేశారు. తాజాగా గుర్తించిన డంప్​ పీఎల్‌జీఏ బెటాలియన్‌లోని మొదటి కంపెనీకి చెందినదని, ఇక్కడ 2025 ఆరంభంలో షెల్స్​ దాచిపెట్టారని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి : MS Dhoni Retirement | ఐపీఎల్‌కు ధోని వీడ్కోలు.. సీఎస్‌కే కొత్త మెంటార్‌గా మహీ..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *