నిజామాబాద్Paddy Procurement Issues | ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదు..: ఎమ్మెల్యే రాకేష్​రెడ్డి

Paddy Procurement Issues | ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదు..: ఎమ్మెల్యే రాకేష్​రెడ్డి

ఆర్మూర్​ నియోజకవర్గంలో దొడ్డువడ్లు వెంటనే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే రాకేష్​రెడ్డి అధికారులను ఆదేశించారు. మున్నూరుకాపుసంఘం సభ్యులు ఎమ్మెల్యేను కలిసి ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించారు.

అక్షరటుడే, ఆర్మూర్​: Paddy Procurement Issues | ఆర్మూర్​ నియోజకవర్గంలో (Armoor) దొడ్డువడ్లు వెంటనే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే రాకేష్​రెడ్డి (MLA Rakesh Reddy) ఆదేశించారు. పట్టణంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ దొడ్డు వడ్లు కొనుగోలు చేయట్లేదని మున్నూరుకాపు సంఘం సభ్యులు ఆదివారం ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన అధికారులతో మాట్లాడారు.

Paddy Procurement Issues | రైతులను ఇబ్బంది పెట్టొద్దు..

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని రాకేష్​ రెడ్డి అన్నారు. వాతావరణంలో మార్పులు వస్తే రైతులు చాలా నష్టపోతారని అధికారులకు వివరించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు దొడ్డు వడ్లు కొనేవిధంగా రైస్ మిల్లర్లు (rice mills), కొనుగోలు కేంద్రాలకు (Paddy Procurement) ఆదేశాలు ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు, ప్రభుత్వ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రైతు ప్రతినిధులు కలిగోట గంగాధర్, బొల్లు పోతన్న, నీరడి మల్లయ్య, రైతులు చిట్టి భోజన్న, సిదాపురం చిన్నయ్య, రాజేశ్వర్, రాజేందర్, తోట రాజేశ్వర్, గుండు చిన్నయ్య, రాజ్ కుమార్, నర్సయ్య, తోట నారాయణ, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Paddy Procurement Issues | ధాన్యం తూకాలు వేగంగా జరపాలి

ధాన్యం తూకాలు వెంటనే ప్రారంభించాలని కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నూతన శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మెప్మా సెంటర్ వడ్ల సెంటర్​ను ఆదివారం పరిశీలించారు. 25 రోజుల నుంచి తూకాలు వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి వెంటనే డీఎస్​వో, సివిల్ సప్లయ్​ డీఎంలతో మాట్లాడారు. వెంటనే తూకాలు వేయించి, రైస్​మిల్లర్స్ తరుగు లేకుండా పంపించాల్సిందిగా కోరారు. లేనిపక్షంలో రెండు మూడు రోజుల తర్వాత బీజేపీ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిట్టి భజన, రాములు, రైతులు పాల్గొన్నారు.

6545

ఇది కూడా చదవండి: TVK Resort Politics| తమిళనాట రిసార్ట్​ రాజకీయాలు షురూ.. ఫలితాలకు ముందే అలర్ట్ అయిన టీవీకే అధ్యక్షుడు విజయ్​..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Battery Fan Blast| మెదక్ జిల్లాలో ప్రమాదం.. బ్యాటరీ పేలి తెగిపడిన బాలుడి వేళ్లు !

అక్షరటుడే వెబ్‌డెస్క్: మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో ఒక చిన్న...

NTPC Jobs 2026 | ఎన్టీపీసీలో ఉద్యోగావకాశాలు.. ఎంపికైతే రూ. 55 వేలపైనే వేతనం!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: NTPC Jobs 2026 | కేంద్ర ప్రభుత్వ సంస్థలో...

Lorry Garage Fire | లారీ బాడీ బిల్డింగ్ గ్యారేజ్​లో అగ్నిప్రమాదం..

అక్షరటుడే, బాన్సువాడ: Lorry Garage Fire | లారీ బాడీ బిల్డింగ్...

IPL Ticket Scam| ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందాపై పోలీసుల పంజా.. అడ్డంగా బుక్కైన ముఠా!

అక్షరటుడే, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ కొనసాగుతుండడాన్ని కొందరు స్వార్థపరులు సొమ్ము...