అక్షరటుడే, బాల్కొండ: Balkonda Gambling Raid | బాల్కొండ (balkonda) ఊర చెరువు సమీపంలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ఎస్సై యాసిర్ అరాఫత్ వివరాలు వెల్లడించారు.
Balkonda Gambling Raid | ఊర చెరువు సమీపంలో..
మండంలోని ఊరచెరువు సమీపంలో పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడ జూదం ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు గుర్తించారు. అనంతరం వారివద్ద నుంచి రూ.7,880 నగదు, ఆరు సెల్ఫోన్లు, ఐదు బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పేకాటకు దూరంగా ఉండాలని, ఎవరైనా పేకాట ఆడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లుగా తెలిస్తే సమాచారం ఇవ్వాలని.. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: హెల్మెట్ లోనే ఎయిర్ బ్యాగ్…