Nizamabad Urban Development | రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి

రాజకీయాలకు అతీతంగా నగర అభివృద్ధి కోసం పాటుపడతానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Urban Development | రాజకీయాలకు అతీతంగా నగర అభివృద్ధి కోసం పాటుపడతానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని 34, 39వ డివిజన్లలో బుధవారం రోడ్డు పనులకు భూమిపూజ చేశారు.

Nizamabad Urban Development | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే (MLA Dhanpal) మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారంతో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో కేంద్ర నిధులతో అభివృద్ధి కొనసాగుతుందన్నారు. కార్పొరేషన్ లో ఇటీవల కేటాయించిన 20 లక్షల నిధులతో పాలు డివిజన్లలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫండ్ కేటాయించాలని, దీంతో మరిన్ని పనులు ముందుకు సాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు బంటు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి, నాయకులు సాయిరాం, పవన్ ముందడ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad Urban Development | పాఠశాల ఆకస్మిక తనిఖీ..

నగరంలోని మిర్చి కంపౌండ్ లో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల మధ్యాహ్న భోజన చేస్తుండగా పరిశీలించారు. అయితే మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా నాణ్యత ఉండాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

ఇది కూడా చదవండి..: Eklavya Model School | ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్వహణను మరింత మెరుగుపర్చాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *