అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Losses | బలహీనమైన ప్రపంచ సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market)లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నెగెటివ్ గా మారింది. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో విస్తృతమైన అమ్మకాల ఒత్తిడితో బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల బాటలో పయనించాయి.
ఫార్మా, టెలికాం, మీడియా ఇండెక్స్‌లు మాత్రమే లాభాలతో ముగిశాయి. మెటల్, కన్జూమర్ డ్యూరెబుల్, పవర్, క్యాపిటల్ గూడ్స్, ఆటో రంగాల ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా నష్టంతో ఉన్నాయి. ఆటో, మెటల్ మరియు కన్స్యూమర్ డ్యూరెబుల్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా నష్టపోయాయి.
Stock Market Losses | నష్టాýతో ప్రారంభమై..
సెన్సెక్స్ ఉదయం 156 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా అక్కడినుంచి కోలుకుని 202 పాయింట్లు పెరిగి లాభాల బాట పట్టింది. అయితే ఇంట్రాడే గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో 798 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 64 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 67 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 249 పాయింట్లు పడిపోయింది. చివరికి సెన్సెక్స్ 500 పాయింట్ల నష్టంతో 82,031 వద్ద, నిఫ్టీ 159 పాయింట్ల నష్టంతో 25,227 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Losses | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,5121 కంపెనీలు లాభపడగా 2,924 స్టాక్స్ నష్టపోయాయి. 209కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 102 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 127 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 8 కంపెనీలు లాభాలతో, 22 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎస్బీఐ 2.26 శాతం, ఐటీసీ 1.37 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.22 శాతం, పవర్‌గ్రిడ్ .39.70 శాతం, మారుతి 0.25 శాతం, లాభపడ్డాయి.
Top Losers : టైటాన్ 4.82 శాతం, టీసీఎల్ 2.49 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.45 శాతం, ఎటర్నల్ 2.45 శాతం, ఇండిగో 1.97 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Hyderabad New Restaurants | హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైటెక్ సిటీ ‘ది లాఫ్ట్’లో నాలుగు కొత్త రెస్టారెంట్లు ప్రారంభం..