అక్షరటుడే, వెబ్‌డెస్క్: New Zealand Test | భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసింది. స్టంప్స్ సమయానికి కివీస్ జట్టు 82 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 243 పరుగులు చేసింది.
తొలి టెస్ట్‌లో భారత్ (India) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ఆరంభం కాగానే భారత బౌలర్లు విజృంభించారు. తొలి ఓవర్లో బుమ్రా టామ్ లాథమ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం 12 పరుగుల వద్ద కాన్వేను అంకుశ్ ఔట్ చేశాడు. బుమ్రా 3 వికెట్లతో చెలరేగడంతో న్యూజిలాండ్ జట్టు 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో ఉన్న జట్టును హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ ఆదుకున్నారు.
New Zealand Test | సెంచరీతో చెలరేగి..
హెన్రీ నికోల్స్ 221 బంతుల్లో 14 ఫోర్లతో అజేయంగా 113 పరుగులు చేశాడు. మరో వైపు గ్లెన్ ఫిలిప్స్ 182 బంతుల్లో 13 ఫోర్లతో 94 రన్స్ తో క్రీజ్‌లో ఉన్నాడు. ఇద్దరు కలిసి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఆరో వికెట్‌కు 322 బంతుల్లో 173 భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో కివీస్ జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఇప్పటికే ఆ దేశంతో జరిగిన వన్డే, టీ 20 సిరీస్‌ను గెలుచుకున్న భారత్.. టెస్ట్ సిరీస్‌ను సైతం కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు టెస్ట్‌ల్లో గెలిచి పరువు నిలుపుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది.
ఇది కూడా చదవండి..: Travis Head released | ఐపీఎల్ 2027 : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు షాక్.. స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ రిలీజ్!