అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rajagopal Reddy | సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడు ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. రాజగోపాల్‌రెడ్డి విషయం పరిశీలిస్తున్నామని చెప్పారు.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ గాంధీ భవన్లో గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి అంశంపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు స్పందించారు. క్రమశిక్షణ ముందు అందరూ సమానమే అన్నారు. రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి మాట్లాడిన అన్ని మాటలను పరిశీలిస్తామని చెప్పారు. పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థను అవలంబిస్తుందని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అంశాన్ని హైకమాండ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుందని తెలిపారు. కొండ సురేఖ విషయంలో చర్యలు తీసుకోవడానికి సమయం పట్టిందని, వీరి అంశంలో సైతం అన్ని పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామన్నారు.
Rajagopal Reddy | అప్పుల ఊబిలోకి నెట్టిన కేసీఆర్
నీటి విషయంలో రాజీ ప్రసక్తే లేదని పీసీసీ చీఫ్ అన్నారు. నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తరలివెళ్ళకుండా కాంగ్రెస్ అడ్డుకుందన్నారు. బనకచర్లపై ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంతోనే పర్యావరణ అనుమతి ఆగిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో కృష్ణా బేసిన్‌ను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో సుమారు రూ.1.84 లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారన్నారు. రాష్ట్రానికి కొత్తగా నియమితులైన ఏఐసీసీ ఇన్‌ఛార్జి సందీప్ నిబద్ధత గల నాయకుడని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Rajagopal Reddy | భూములు దోచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు