Lakshmi Narasimha Swamy Kalyanam | కమనీయం.. లక్ష్మీనృసింహుని కల్యాణం

నింబాచల గిరిపై కొలువుదీరిన శ్రీ లక్ష్మీనృసింహా స్వామి కల్యాణ మహోత్సవం గురువారం కనుల పండువగా జరిగింది.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్‌ : Lakshmi Narasimha Swamy Kalyanam | ప్రముఖ పుణ్యక్షేత్రమైన నింబాచల గిరిపై కొలువుదీరిన శ్రీ లక్ష్మీనృసింహా స్వామి దివ్య కల్యాణ మహోత్సవం గురువారం అత్యంత వైభవంగా, కనుల పండువగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన ఈ పరిణయ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు.

Lakshmi Narasimha Swamy Kalyanam | వేలాదిగా తరలివచ్చిన భక్తులు..

భీమ్‌గల్‌ (Bheemgal) ప్రాంతంతో పాటు పరిసర గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణలతో నింబాచల క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉత్సవాల్లో భాగంగా ఉదయం 9.30 గంటలకు ప్రధాన యాగ్నికుల ఆధ్వర్యంలో గర్భాలయంలోని మూలవిరాట్టుకు శాస్త్రోక్తంగా కల్యాణ క్రతువు నిర్వహించారు. అనంతరం స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఉత్సవ మూర్తులను పుష్ప పల్లకిలో మేళతాళాల నడుమ కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. వేద మంత్రాల సాక్షిగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని నృసింహ స్వామివారికి కన్యాదానం చేసే ఘట్టం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది.

సామాజిక ఐక్యతకు ప్రతీకగా సర్వసమాజ్‌ సేవ

Lakshmi Narasimha Swamy Kalyanam | స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని భీమ్‌గల్‌ సర్వసమాజ్‌ ఆధ్వర్యంలో స్వామివారికి పట్టువస్త్రాలు, పుస్తెమట్టెలను సమర్పించారు. సర్వసమాజ్‌ అధ్యక్షుడు పతాని కృష్ణ ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాల ప్రతినిధులు, కమిటీ సభ్యులు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. కులమతాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాలు ఒక్కతాటిపైకి వచ్చి స్వామివారి సేవలో పాల్గొనడం సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.

6756

ఇది కూడా చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు ఊరట కలిగించే వార్త. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *