MLA Rajagopal Reddy | ముఖ్య నేతలు హుందాగా మాట్లాడాలి.. సీఎంకు రాజగోపాల్​రెడ్డి కౌంటర్

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్​రెడ్డి లక్ష్యంగా విమర్శలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLA Rajagopal Reddy | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) లక్ష్యంగా విమర్శలు చేశారు. ఉన్నత పదవుల్లో ఉన్న ముఖ్య నేతలు హుందాగా మాట్లాడాలని హితవు పలికారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా పోస్ట్​ చేశారు.

రాజగోపాల్​రెడ్డి రెండు రోజుల క్రితం సీఎంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. గతంలో సైతం తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. సీఎం భాషపై ఇటీవల ఓ సభలో మాట్లాడారు. అదృష్టం కొద్ది ఆయన సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్​రెడ్డి గురువారం సిద్దిపేట సభలో స్పందించారు. తమ నేతలకు కొందరికి పిచ్చి కుక్క కరిచినట్లు ఉందని, మైకుల ముందు ఏది పడితే అది మాట్లాడుతున్నారని అన్నారు. వారిని కాంగ్రెస్​ కార్యకర్తలు ఎర్రగడ్డకు తీసుకు పోతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మరోసారి రాజగోపాల్​రెడ్డి ఎక్స్​ వేదిగా స్పందించారు.

MLA Rajagopal Reddy | ప్రజలు క్షమించరు

అధికారం ఉందన్న అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని గ్రహించాలని రాజగోపాల్​ రెడ్డి అన్నారు. అదృష్టం కొద్దీ దక్కిన అధికారంతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడే, ప్రజావసరాలను విస్మరించి దుర్మార్గపు పాలన సాగించే పాలకులను తెలంగాణ ప్రజానీకం, చరిత్ర ఎన్నిటికీ క్షమించదని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసేలా ధర్మంగా, నిజాయితీగా పాలన సాగించేలా ముఖ్య నేతలకు సద్బుద్ధి, ఆత్మ పరిశీలనా జ్ణానాన్ని ప్రసాదించాలని ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నానని పోస్ట్ చేశారు.

MLA Rajagopal Reddy | రాజకీయాల్లో తీవ్ర చర్చ

కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్​ పార్టీ ఇరుకున పడుతోంది. ఓ వైపు కరువుతో ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతలే ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం పార్టీకి నష్టం కలిగిస్తోంది. కోమటిరెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో అధిష్టానం ఆయనపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్​ నివేదిక సైతం పంపారు. ఆయనపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

ఇది కూడా చదవండి..: Talari Balaiah | కష్టాల కొలిమిలోంచి న్యాయస్థానపు ఉన్నత పీఠంపైకి.. తలారి బాలయ్య స్ఫూర్తిదాయక ప్రస్థానం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *