Lorry Garage Fire | లారీ బాడీ బిల్డింగ్ గ్యారేజ్​లో అగ్నిప్రమాదం..

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Lorry Garage Fire | లారీ బాడీ బిల్డింగ్ గ్యారేజీలో అగ్నిప్రమాదం జరిగింది. బాన్సువాడ పట్టణంలోని (Banswada) తాడ్కోల్ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.

Lorry Garage Fire | నిల్వ ఉంచిన కట్టెలకు మంటలు..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్యారేజీలో నిల్వ ఉంచిన కట్టెలకు మొదట మంటలు అంటుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించి గ్యారేజీలో ఉన్న ఇతర సామగ్రిని చుట్టుముట్టాయి. మంటలు తీవ్రంగా ఎగసిపడుతూ దట్టమైన పొగలు వ్యాపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందారు. స్థానికులు పరిస్థితిని గమనించి వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

Lorry Garage Fire | ఫైరింజన్​ రాకతో అదుపులోకి మంటలు..

సమాచారం అందుకున్న అగ్నిమాపక (Fire station) సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. సిబ్బంది సమయానికి స్పందించి మంటలు మరింత వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. దీంతో సమీపంలోని ఇతర దుకాణాలు, నివాస గృహాలకు ముప్పు తప్పింది. భారీ ప్రమాదం తృటిలో తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గ్యారేజీలో ఉన్న సామగ్రికి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ఆస్తి నష్టం ఎంతవరకు జరిగిందన్నది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: IPL Ticket Scam| ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందాపై పోలీసుల పంజా.. అడ్డంగా బుక్కైన ముఠా!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *