అక్షరటుడే, వెబ్‌డెస్క్: Lava Smart 4 Pro | దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ అయిన లావా (Lava) మరో మోడల్ ఫోన్ ను తీసుకువచ్చింది. లావా స్మార్ట్ 4 ప్రో పేరుతో బడ్జెట్ ధరలో మరో 4జీ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. యునిసాక్ టీ610 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే ఈ ఫోన్ సింగిల్ వేరియింట్‌లో లభించనుంది. లావాకు చెందిన ఆఫ్ లైన్ స్టోర్స్‌లో అందుబాటులో ఉండే ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
డిస్‌ప్లే : 6.75 ఇంచ్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్‌ప్లే అమర్చారు. ఇది 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 720 1600 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది.
ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ సర్టిఫికెట్ ఉంది.
Lava Smart 4 Pro | సాఫ్ట్‌వేర్..
యునిసాక్ టీ610 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
Lava Smart 4 Pro | కెమెరా సెటప్..
వెనకవైపు 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
Lava Smart 4 Pro | బ్యాటరీ సామర్థ్యం..
7000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 18డబ్ల్యూ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
సింగిల్ వేరియంట్..
నీలం బ్లూ, కోణార్క్ గోల్డ్ కలర్స్‌లో సింగిల్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999.
ఇది కూడా చదవండి..: Airtel Market Capitalization | జియోను వెనక్కి నెట్టిన ఎయిర్‌టెల్.. అగ్రస్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్