Pension Bribe Case | పింఛన్​ మంజూరు కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

పింఛన్​ మంజూరు చేయించినందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఓ జీపీ కార్యదర్శి ఏసీబీకి దొరికిపోయాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pension Bribe Case | రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త పింఛన్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. వితంతువులు, ఇంటరి మహిళలు, దివ్యాంగుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులకు పింఛన్లు మంజూరు చేసింది. అయితే పింఛన్ల మంజూరు కోసం పలువురు అధికారులు, సర్పంచులు లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఓ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ రెడ్​ హ్యాండెడ్​గా దొరికిపోయాడు

Pension Bribe Case | రూ.10 వేలు తీసుకుంటుండగా..

కరీంనగర్​ జిల్లా (Karimnagar District) మానకొండూరు మండలం లక్ష్మీపూర్​ పంచాయతీ కార్యదర్శి లవుద్య చవాన్ లాల్​ను ఏసీబీ అధికారులు శనివారం వలపన్ని పట్టుకున్నారు. చేయూత పెన్షన్ (వితంతు పెన్షన్) దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి, ఫిర్యాదుదారుని కోడలికి వితంతు పెన్షన్ మంజూరు చేయించినందుకు పంచాయతీ కార్యదర్శి రూ.10 వేలు బహుమతిగా డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలి మామ ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి ఇంట్లో కార్యదర్శి చవాన్​లాల్​ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి..: Indiramma Family Life Insurance | ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో ఆర్థిక భరోసా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *