TGSPDCL ACB Trap | రూ.30 వేలు లంచం తీసుకుంటూ దొరికిన సబ్​ ఇంజినీర్​

టీజీఎస్‌పీడీసీఎల్ సబ్ ఇంజనీర్ సంతోష్ ఆనంద్ రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGSPDCL ACB Trap | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని టీజీఎస్‌పీడీసీఎల్ గాంధీ నగర్ సెక్షన్ ఆఫీస్ సబ్ ఇంజనీర్ జి. సంతోష్ ఆనంద్​ ఏసీబీ (ACB)కి చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్​గా దొరికిపోయాడు.

విద్యుత్ చౌర్యం ఆరోపణకు సంబంధించి ఓ వ్యక్తిపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు సబ్​ ఇంజినీర్​ సంతోష్​ ఆనంద్​ రూ.50 వేల లంచం డిమాండ్​ చేశారు. అనంతరం ఆ మొత్తాన్ని రూ.30 వేలకు తగ్గించాడు. దీంతో ఆ వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సబ్​ ఇంజినీర్​ ఫిర్యాదుదారుడి ఇంట్లో శనివారం రూ.30 వేల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి, జ్యుడిషియల్ రిమాండ్ కోసం హైదరాబాద్‌లోని ఎస్‌పిఈ & ఏసీబీ కేసుల గౌరవ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరుస్తామని తెలిపారు.

TGSPDCL ACB Trap | ఆగని అవినీతి

రాష్ట్రంలో అవినీతి రాజ్యం ఏలుతోంది. ఏసీబీ దాడులు చేస్తున్నా లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. కొంత మంది అయితే లంచం తీసుకోవడం కూడా తమ హక్కుగా భావిస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే ప్రజలు, కాంట్రాక్టర్లను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఏసీబీకి దాడుల్లో పలువురు పట్టుబడుతున్నా.. మిగతా వారు మాత్రం భయపడటం లేదు. ఏసీబీకి చిక్కిన వారి విషయంలో కఠిన చర్యలు లేకపోవడంతోనే అవినీతి ఆగడం లేదని ప్రజలు అనుకుంటున్నారు.

దీనిని కూడా చదవండి : Pension Bribe Case | పింఛన్​ మంజూరు కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *