అక్షరటుడే, వెబ్డెస్క్ : Fire Accident | రంగారెడ్డి (Rangareddy) జిల్లా షాబాద్ మండలం హైతాబాద్ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చందనవెల్లిలోని ట్రీ ఫాయిల్ కంపెనీలో ఆదివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ అలుముకుంది.
అగ్ని ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి వేశారు. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తలరించారు. ఆస్తి నష్టం, ప్రమాదానికి గల కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Dowry Car Dispute | కారు కోసం పెళ్లి రద్దు చేసుకున్న పోలీస్