అక్షరటుడే, నందిపేట్: Husband Murder Case | నిత్యం తనను వేధిస్తుండడంతో విసుగుచెందిన భార్య తన భర్తను కడతేర్చింది. ఈ ఘటన నందిపేట్ (Nandipet) గ్రామంలోని రాజ్‌నగర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
Husband Murder Case | రాజ్‌నగర్ దుబ్బ ఏరియాలో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిపేట్ గ్రామంలోని రాజ్ నగర్ దుబ్బ ఏరియాలో నివాసముండే గోసం గంగాధర్ (46) నిత్యం మద్యం సేవిస్తుండేవాడు. అనంతరం తన భార్య సుమలతతో గొడవపడేవాడు. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గురువారం సాయంత్రం సైతం మద్యంతాగిన అనంతరం భార్యపై దాడికి యత్నించడంతో ఆమె ఇంట్లోనే గొంతునులిమి హత్య చేసింది. అతను పెట్టే బాధలు భరించలేకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.
ఇది కూడా చదవండి..: Bikkanoor Sarpanch Attack Case | పంచాయతీ కార్యాలయంలో ఉద్రిక్తత.. సర్పంచిపై దాడికి యత్నం, బెదిరింపులు! వార్డు సభ్యుడిపై కేసు నమోదు