అక్షరటుడే, బాల్కొండ : Ayyappa Mala Controversy | జిల్లాలోని బాల్కొండ (Balkonda) మోడల్ స్కూల్‌లో వివాదం చోటుచేసుకుంది. అయ్యప్ప మాల ధరించి విద్యార్థులు పాఠశాలకు రావడంతో ప్రిన్సిపాల్ అభ్యంతరం తెలిపారని వారు ఆరోపించారు.
Ayyappa Mala Controversy | ఇదేం పద్ధతి..
బడిలో చక్కగా చదువుకుంటున విద్యార్థులకు మతపరమైన నిబంధనలు పెట్టడం ఎంతవరకు సబబని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. అయ్యప్ప మాల ధరిస్తే తప్పేమిటని వారు ప్రశ్నించారు. గతంలో కూడా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌పై పలు ఆరోపణలు ఉన్నాయన్నారు. తాజాగా విద్యార్థులు చేసిన ఆరోపణలతో పాఠశాలలో నెలకొన్న పరిస్థితులపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Husband Murder Case | వేధింపులు తాళలేక భర్తను కడతేర్చిన భార్య