Mahatma Jyotirao Phule Death Anniversary | విద్యా విప్లవానికి పునాదులు వేసిన దార్షానికుడు మహాత్మా జ్యోతిరావు పులే

రావుట్ల చిన్న నర్సయ్య స్మారక సత్యశోధక్ నగదు పురస్కారాలను, ఉత్తమ విద్యార్థి అవార్డులను, ప్రశంస పత్రాలను, మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల, కాలేజీ టాపర్లకు ఉత్తమ విద్యార్థి అవార్డులను, ప్రశంస పత్రాలను అందజేశారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mahatma Jyotirao Phule Death Anniversary | భారత సామాజిక విప్లవోద్యమ పితామహులు, సత్యశోధక్ సమాజ స్థాపకులు, జ్ఞానజ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే 136వ వర్ధంతిని సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో సిరికొండ సత్యశోధక్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ ఆర్.నర్సయ్య అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథిగా తెలంగాణ Telangana విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. అక్కెనపల్లి పున్నయ్య, విశిష్ట అతిథులుగా తెలంగాణ విశ్వవిద్యాలయం అసొసియేట్ ప్రొఫెసర్ డా. వాసం చంద్రశేఖర్, గౌరవ అతిథులుగా సిరికొండ తహసీల్ధార్ రవీందర్ రావు, జక్రాన్ పల్లి మండల విద్యాధికారి శ్రీనివాస్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్, స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె. సాల్మాన్, డీటీఫ్ జిల్లా అధ్యక్షులు యం. బాలయ్య, గెజెట్టెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, తిరుపతి, గణజ్యోతి, షేక్ పర్వీన్, బీఆర్​ఎస్​ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షులు సంజీవ్, నిజామాబాద్ జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగామోహన్, తపస్ మండల అధ్యక్షులు కిరణ్, ట్రస్మా నాయకులు ముజీబ్, ప్రసాద్, మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

akshara today .jpg4

Mahatma Jyotirao Phule Death Anniversary | అత్యంత కీలకమైన పాత్ర

అతిథులంతా కలిసి మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. అక్కెనపల్లి పున్నయ్య మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పులే భారతదేశ సామాజిక విప్లవోద్యమంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన మహనీయుడని, విద్య ద్వారానే సామాజిక దురాచారాలు, మూఢనమ్మకాలు, అసమానతల నుంచి సమాజానికి విముక్తి కల్పించవచ్చని నమ్మిన గొప్ప దార్శనికుడని పేర్కొన్నారు.

మహిళలకు, అణగారిన వర్గాలకు విద్యను దూరం చేసిన ఆనాటి సామాజిక పరిస్థితులను ఎదిరించి, తన సతీమణి సావిత్రిబాయి పులేతో కలిసి బాలికల విద్య కోసం పాఠశాలలను స్థాపించడం ద్వారా భారతదేశంలో విద్యా విప్లవానికి పునాదులు వేశారని కొనియాడారు.

akshara today .jpg2

Mahatma Jyotirao Phule Death Anniversary | ఆయన బాటలో సంఘ సంస్కర్తలు..

సత్యశోధక్ సమాజ్‌ను స్థాపించి కులవివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతూ సమానత్వం, మానవత్వం, హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని సమాజానికి అందించారని వివరించారు.

మహాత్మా జ్యోతిరావు పులే చూపిన మార్గంలోనే భాగ్యరెడ్డి వర్మ, కందుకూరి వీరేశలింగం వంటి సంఘ సంస్కర్తలు కూడా సమాజ అభ్యున్నతికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు.

ఎన్నో సామాజిక అవరోధాలు, ఒడుదొడుకులను అధిగమించి విద్యావ్యాప్తి కోసం మహాత్మా జ్యోతిరావు పులే చేసిన పోరాటం నేటి తరానికి గొప్ప స్ఫూర్తిదాయకమని అన్నారు.

ఆయన ఆశయాలను భావితరాలకు పరిచయం చేస్తూ, విద్యార్థుల్లో సామాజిక స్పృహ, ప్రతిభ, నాయకత్వ లక్షణాలను పెంపొందించే లక్ష్యంతో సత్యశోధక్ పాఠశాల నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.

విద్యార్థులకు అండగా నిలుస్తూ వారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపించే ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకొని, భవిష్యత్తులో ఇదే పాఠశాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసి తమ తల్లిదండ్రుల పేర్లతో పాటు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల పేరును కూడా నిలబెట్టాలని ఆకాంక్షించారు.

akshara today .jpg5

 

Mahatma Jyotirao Phule Death Anniversary | భవిష్యత్తులో ఒక విశ్వవిద్యాలయం స్థాయికి ఎదగాలి..

సత్యశోధక్ పాఠశాల ప్రస్తుత స్థాయి నుంచి మరింత అభివృద్ధి చెంది, భవిష్యత్తులో ఒక విశ్వవిద్యాలయం స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, ఈ పాఠశాలను తన సొంత విద్యాసంస్థగా భావిస్తున్నానని పేర్కొంటూ పాఠశాల యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

విశిష్ట అతిథి తెలంగాణ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డా. వాసం చంద్రశేఖర్ మాట్లాడుతూ.. భారతదేశంలో సామాజిక సమానత్వం, విద్యావ్యాప్తి, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిరావు పులే చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తూ, విద్య ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని నిరూపించిన గొప్ప సంఘ సంస్కర్త పులే అని పేర్కొన్నారు.

ముఖ్యంగా ఉత్పత్తి కులాలు, అణగారిన వర్గాల నుంచి ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నత స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉందని, నేటి సమాజానికి శాస్త్రీయ దృక్పథం కలిగిన వ్యక్తులు, పరిశోధకులు ఎంతో అవసరమని అన్నారు.

పులే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సత్యశోధక్ పాఠశాలను స్థాపించి, విద్య ద్వారా సామాజిక మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న పాఠశాల ఛైర్మన్ నర్సయ్యని ప్రత్యేకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

akshara today .jpg3

Mahatma Jyotirao Phule Death Anniversary | ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలపై సమగ్ర అవగాహన పెంపొందించుకొని, శాస్త్రీయ ఆలోచనా విధానంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సత్యశోధక్ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆహుతులందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి. పులే వర్ధంతిని పురస్కరించుకొని నిర్వహించిన పులే స్మారక సిరికొండ మండల స్థాయి ప్రజ్ఞా పాటవ పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు.

akshara today .jpg1

గత విద్య సంవత్సరం (2025-26) SSC, ఇంటర్మీడియట్ సిరికొండ మండల టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు రావుట్ల చిన్న నర్సయ్య స్మారక సత్యశోధక్ నగదు పురస్కారాలను, ఉత్తమ విద్యార్థి అవార్డులను, ప్రశంస పత్రాలను, మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల, కాలేజీ టాపర్లకు ఉత్తమ విద్యార్థి అవార్డులను, ప్రశంస పత్రాలను అందజేశారు.

akshara today 1 1.jpg6 1

Mahatma Jyotirao Phule Death Anniversary | సత్యశోధక్ ప్రతిభా పురస్కారాలు పొందిన విద్యార్థులు

SSC లో సిరికొండ మండల టాపర్ గా నిలిచిన ఎం. సుదీప్తి (582/600, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిరికొండ)కి ₹.5000/- ద్వితీయ టాపర్ గా నిలిచిన ఆర్. నితిన్ (578/600, గిరిజన గురుకుల బాలుర పాఠశాల చిమన్ పల్లి)కు ₹.3000/-, ఇంటర్మీడియట్ లో సిరికొండ మండల టాపర్లుగా నిలిచిన ఆర్. భరత్ (928/1000, MPC, గిరిజన గురుకుల బాలుర పాఠశాల చిమన్ పల్లి), టి . శృతిక (928/1000), BiPC, పీఎం తెలంగాణ ఆదర్శ కళాశాల సిరికొండ) లకు ఒక్కొక్కరికి ₹.3000/- రావుట్ల చిన్న నర్సయ్య స్మారక నగదు పురస్కారాలతో పాటు ఉత్తమ విద్యార్థి అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రత్యేకంగా సత్యశోధక్ పాఠశాల టాపర్ గా నిలిచిన కె. శ్రీనిధి (576/600)కి తాహెర్ బిన్ హందాన్ నగదు పురస్కారం
₹.5000/-, ఉత్తమ విద్యార్థి అవార్డు, ప్రశంసా పత్రం అందించారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

akshara today .jpg7

SSC & INTER లో స్కూల్/కాలేజీ టాపర్లుగా నిలిచి ప్రత్యేక జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో సత్కారాలు పొందిన విద్యార్థులు..

  • సిహెచ్. అక్షిత (573/600) మహాత్మజ్యోతిరావు పూలే బాలికల పాఠశాల, చిమన్ పల్లి
  • ಜಿ. ಅಭಿಜ್ಞ (572/600) పియం. శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల, సిరికొండ
  • సిహెచ్. సాహితి (571/600) ప్రతిభ హైస్కూల్, సిరికొండ
  • పి. సాహితి (567/600) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రావుట్ల
  • ఎస్. శశాంక్ (564/600) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చిమన్ పల్లి
  • ఎన్. విజ్ఞశ్రీ (561/600) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొండపూర్
  • బి. శ్రీనిది (560/600) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తూంపల్లి
  • బి. అరవింద్ (555/600) గిరిజన ఆశ్రమ పాఠశాల, సిరికొండ
  • పి. హర్షవర్ధన్ (554/600) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గడ్కోల్
  • డి. ప్రణతి (554/600) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, న్యావనంది
  • ఎం. రహత్ (552/600) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాల్ల, రామడుగు
  • పి. శ్రీవర్షిణి (523/600) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెద్ద వాల్గోట్
  • బి. శ్రీజ (513/600) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొండూర్
  • కె. సంధ్య (511/600) కస్తురిబా గాంధి బాలికల విద్యాలయం, పెద్ద వాల్గోట్
  • బి. నితిన్ (915/1000) కామధేను జూనియర్ కళాశాల, సిరికొండ
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *