TVS EV Sales | టీవీఎస్ మోటార్ జోరు.. గణనీయంగా పెరిగిన ఈవీ సేల్స్

Shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TVS EV Sales | టీవీఎస్ మోటార్ (TVS Motor) మొత్తం(దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో సహా) అమ్మకాలు గతేడాది ఏప్రిల్ తో పోలిస్తే ఈ ఏప్రిల్ లో 7 శాతం పెరిగి 4.73 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో అమ్మిన 4.43 లక్షల యÖనిట్లు అమ్ముడయ్యాయి.

ఈ వృద్ధి ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehicles) విక్రయాల కారణంగా వచ్చింది. ఈవీల అమ్మకాలు 36 శాతం( 37,771 యూనిట్లు) పెరగడం గమనార్హం. టీవీఎస్ మోటార్ కంపెనీ త్రీ వీలర్ వాహనాల అమ్మకాలూ గణనీయంగా పెరిగాయి. 37 శాతం వృద్ధితో 18,637 యూనిట్లు అమ్ముడయ్యాయి.

TVS EV Sales | కోర్ టూ వీలర్ సెగ్మెంట్ లో 6 శాతమే..

కంపెనీ కోర్ టూ వీలర్స్ సెగ్మెంట్ లో మాత్రం తక్కువ వృద్ధి నమోదయ్యింది. మొత్తం విక్రయాలు(దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో సహా) వార్షిక ప్రాతిపదికన 6 శాతం పెరిగి 4.30 లక్షల నుంచి 4.55 లక్షల యూనిట్లకు చేరాయి. ఇదే సమయంలో దేశీయ ద్విచక్ర వాహన విక్రయాల్లో 8 శాతం వృద్ధి నమోదయ్యింది. గతేడాది ఏప్రిల్‌లో 3.23 లక్షల యూనిట్లు అమ్ముడవగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 3.48 లక్షల యూనిట్లను విక్రయించారు. స్కూటర్ల విక్రయాలు 24 శాతం పెరిగాయి. గతేడాది 1.69 లక్షల యూనిట్లుగా ఉన్న స్కూటర్ల అమ్మకాలు.. ఈసారి 2.11 లక్షల యూనిట్లకు పెరిగాయి. అయితే బైక్ ల అమ్మకాల్లో వేగం తగ్గింది. గతేడాది ఏప్రిల్‌లో 2.20 లక్షల బైక్ లను విక్రయించగా.. ఈ ఏడాది ఏప్రిల్ లో 2 లక్షల యూనిట్లే అమ్ముడయ్యాయి.

ఇది కూడా చదవండి..: X Money App | ‘ఎక్స్ మనీ’ వచ్చేస్తోంది..

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *