అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana ICC Committee | మహిళా ఉద్యోగుల రక్షణ, పని ప్రదేశాల్లో వేధింపుల నివారణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలోని రెవెన్యూ శాఖలో ‘అంతర్గత ఫిర్యాదుల కమిటీ’ (Internal Complaints Committee – ICC)ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం (మే 4, 2026) జీవో జారీ చేసింది.
Telangana ICC Committee | సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు
లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POSH Act, 2013), 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. సచివాలయంలోని అన్ని విభాగాల్లో ఐసీసీలను ఏర్పాటు చేయాలన్న మహిళా, శిశు సంక్షేమ శాఖ అభ్యర్థన మేరకు రెవెన్యూ శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana ICC Committee | కమిటీ సభ్యుల వివరాలు
ఈ కమిటీకి ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా సీనియర్ మహిళా అధికారిని నియమించారు.
- ఎల్.ఎల్.వి. సుబ్బమ్మ (అడిషనల్ సెక్రటరీ) ప్రిసైడింగ్ ఆఫీసర్
- జె.వి. విజయలక్ష్మి (జాయింట్ సెక్రటరీ) సభ్యురాలు
- ఎ. ఉమా రెడ్డి (సెక్షన్ ఆఫీసర్) సభ్యురాలు
- కె. నివేదిత (అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్) టీజీ సచివాలయ మహిళా సంఘం ప్రతినిధి
Telangana ICC Committee | కమిటీ బాధ్యతలు:
- పని ప్రదేశంలో మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే వేధింపులపై వచ్చే ఫిర్యాదులను ఈ కమిటీ స్వీకరిస్తుంది.
- ఫిర్యాదులపై క్షుణ్ణంగా విచారణ జరిపి, సమగ్ర నివేదికను సిద్ధం చేస్తుంది.
- నివేదిక ఆధారంగా నిందితులపై నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ కార్యదర్శికి సిఫార్సు చేస్తుంది.
మహిళా ఉద్యోగులకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ డి.ఎస్. పేరుతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
Mamata Banerjee setback | భవానీపూర్‌లో మమత వెనుకంజ.. నందిగ్రామ్‌లో సీఎం అభ్యర్థి సువేందు గెలుపు!

