తెలంగాణWeather Update | వాతావరణ శాఖ చల్లని కబురు.. తెలంగాణకు వర్ష సూచన

Weather Update | వాతావరణ శాఖ చల్లని కబురు.. తెలంగాణకు వర్ష సూచన

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Weather Update | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.

వేడి తీవ్రతతో కూలర్లు, ఏసీల వినియోగం పెరిగింది. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వారం రోజులుగా ఎండ తీవ్రత పెరగడం గమనార్హం. ఉదయం 9 గంటలకే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఈ క్రమంలో వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు చల్లని కబురు చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని పేర్కొన్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Weather Update | ఈ జిల్లాల్లో..

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, భద్రాద్రి-కొత్తగూడెంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. సిద్దిపేట, మెదక్, యాదాద్రి, జనగాం, వరంగల్, సంగారెడ్డి, రంగారెడ్డిలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ – రాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. మే 6, 7 తేదీల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్​ ఉంది.

ఇది కూడా చదవండి..: Illegal Mining | అక్రమ మైనింగ్​పై హైడ్రా ఉక్కుపాదం

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Self Enumeration Record | స్వీయ గణనలో రికార్డు.. సోమ్లా నాయక్ తండా ఘనత

అక్షరటుడే, బాన్సువాడ : Self Enumeration Record | బాన్సువాడ మండలం...

Census Self Enumeration | నాగిరెడ్డిపేట మండలంలో జనాభా లెక్కల స్వీయ గణనకు శ్రీకారం

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Census Self Enumeration | జనాభా లెక్కల...

Mamata Banerjee Statement| రాజ్‌భవన్‌కు వెళ్లేది లేదు.. రాజీనామా చేసేది లేదు: మమతా బెనర్జీ

అక్షరటుడే వెబ్‌డెస్క్:Mamata Banerjee Statement| పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన...

BRS Councillor Resignation | బీఆర్​ఎస్​కు​ కౌన్సిలర్ రాజీనామా.. కాంగ్రెస్​లో చేరిక

అక్షరటుడే, ఎల్లారెడ్డి: BRS Councillor Resignation | ఎల్లారెడ్డి మున్సిపల్ 11వ...