Nizamabad DRO Appointments | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాకు డీఆర్​వో, ఆర్డీవోల నియామకం

Balla Sandeep Kumar

అక్షరటుడే, కామారెడ్డి: Nizamabad DRO Appointments |  రాష్ట్రంలో పలువురు అదనపు కలెక్టర్లు, డీఆర్​వో, ఆర్డీవోలను ప్రభుత్వం బదిలీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో ఖాళీగా ఉన్న ముఖ్యమైన పోస్టులకు ప్రభుత్వం అధికారులను నియమించింది.

Nizamabad DRO Appointments | నియమితులైన అధికారులు వీరే..

డిప్యుటేషన్​పై హైదరాబాద్​ (Hyderabad)లో పనిచేస్తున్న పలువురు డిప్యూటీ కలెక్టర్లను ఉమ్మడి జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘కుడా’లో డిప్యుటేషన్​పై పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ రవీందర్ రెడ్డి అడ్లాను బాన్సువాడ ఆర్డీవోగా నియమించారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్​స్టిట్యూషన్ సొసైటీ హైదరాబాద్​లో పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ బి.గీతను నిజామాబాద్ డీఆర్వోగా బదిలీ చేశారు. అలాగే మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డులో పని చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ ఎం.విజయ కుమారిని బోధన్ ఆర్డీవోగా ట్రాన్స్​ఫర్​ చేశారు. బదిలీ అయిన డిప్యూటీ కలెక్టర్లు తక్షణమే విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: BJP Victory Celebration | ఎల్లారెడ్డిలో బీజేపీ విజయోత్సవ సంబరాలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *