BJP Leadership Selection | బెంగాల్, అస్సాం బీజేపీ పగ్గాలు ఎవరికి? రంగంలోకి అమిత్ షా, నడ్డా..

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:BJP Leadership Selection| పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన భారతీయ జనతా పార్టీ.. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో పగ్గాలు చేపట్టే నేతల ఎంపికపై దృష్టి సారించింది. శాసనసభాపక్ష నేతలను (ముఖ్యమంత్రి అభ్యర్థులను) ఎన్నుకునే ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్ర నాయకత్వం కీలక నేతలను పరిశీలకులుగా నియమించింది.

BJP Leadership Selection | పశ్చిమ బెంగాల్ పరిశీలకుడిగా అమిత్ షా..

బెంగాల్‌లో చారిత్రాత్మక విజయం తర్వాత అక్కడ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే బాధ్యతను కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అప్పగించారు. ఆయనతో పాటు కో-అబ్జర్వర్‌గా ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ వ్యవహరించనున్నారు. బెంగాల్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటు, సీఎం అభ్యర్థి ఎంపికలో అమిత్ షా కీలకంగా వ్యవహరించనున్నారు.

BJP Leadership Selection | అస్సాం బాధ్యతల్లో జేపీ నడ్డా..

అస్సాం రాష్ట్రానికి కేంద్ర పరిశీలకుడిగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా నియమితులయ్యారు. ఆయనకు సహాయకుడిగా (అసోసియేట్) హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీని అధిష్టానం కేటాయించింది. వీరిద్దరూ అస్సాం నూతన ఎమ్మెల్యేలతో సమావేశమై నేతను ఎంపిక చేయనున్నారు.

BJP Leadership Selection | ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు..

ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఈ రెండు రాష్ట్రాల్లోనూ వీలైనంత త్వరగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర పరిశీలకులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించి కేంద్ర కమిటీకి నివేదిక సమర్పించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇది కూడా చదవండి: Konda Surekha Comments | పుష్కరాలకు ఏపీకి కోట్లు.. తెలంగాణకు సున్నా.. కేంద్రం వివక్షపై సురేఖ ఆగ్రహం!

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *