అక్షరటుడే, కామారెడ్డి: Women welfare schemes | కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యతనిస్తున్నామని.. అందుకే మహిళలకు ప్రత్యేకంగా ఇందిరమ్మ చీరలను పంపిణీ కార్యక్రమం చేపట్టామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali) తెలిపారు. కామారెడ్డి(Kamareddy) పట్టణంలోని తన నివాసం వద్ద మంగళవారం మహిళలకు చీరలను అందజేశారు.
Women welfare schemes | పేదల సంక్షేమమే లక్ష్యంగా..
షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ప్రతి కుటుంబానికి అండగా నిలబడి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, ఆర్డీవో గిరి, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, తహశీల్దార్ హిమబిందు, డీసీసీ మాజీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సందీప్, పండ్ల రాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: crop procurement | పంట కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం : కేటీఆర్

