అక్షరటుడే, భీమ్‌గల్: Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి (Manala Mohan Reddy) అన్నారు. ఈ మేరకు సికింద్రాపూర్‌లో లబ్ధిదారు మాలెపు అర్చన రాజు, బడా భీమ్‌గల్ శంకురి ప్రమీల, వేల్పూర్ మండలంలోని పడగల్లో మందల లింగుబాయి ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Indiramma Housing Scheme | శరవేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు..
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా మానాల మోహన్‌రెడ్డి తెలిపారు. భీమ్‌గల్ మండలంలో ఇప్పటికే 60శాతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి నివాసం కల్పించాలనే కృత నిశ్చయంతో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఉన్నారన్నారు. మరో నెల రోజుల్లో రెండో విడతలో 3,500 ఇళ్లకు మంజూరు రానుందన్నారు. కార్యక్రమంలో భీమ్‌గల్ మున్సిపల్ ఛైర్మన్ బొదిరే స్వామి, వైస్ ఛైర్మన్ జేజే నర్సయ్య, కౌన్సిలర్ నాగేంద్ర బాబు, సర్పంచ్‌లు రమేష్, నరేందర్, రాజు, భూమారెడ్డి, సురేష్, ఉప సర్పంచ్ నరేందర్, మల్లారెడ్డి నరేష్, నితీష్, జలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: ACB Raids | బోధన్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాల కలకలం

