అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad Chain Snatching | నిజామాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఒకేరోజు మూడు చోట్ల దోపిడీకి యత్నించారు. నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి శ్రీనగర్ కాలనీలో ఈ రోజు (గురువారం, మే 07) ఉదయం ఆరున్నర గంటల సమయంలో చైన్ స్నాచింగ్ చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి స్థానిక మహిళ మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు.
Nizamabad Chain Snatching | మహారాష్ట్రకు చెందిన వారుగా
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే అంతకు ముందు ఈ దొంగలు నగరంలోని మూడో టౌన్ దుబ్బ ప్రాంతంలో వాకింగ్ చేస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు యత్నించారు. కానీ, సదరు మహిళ వెంటనే అలెర్ట్ అయి గొలుసును గట్టిగా పట్టుకోవడంతో దొంగల ప్రయత్నం ఫలించలేదు.
అక్కడి నుంచి గాయత్రీనగర్‌కు చేరుకున్న దుండగులు స్థానిక మహిళ మెడలో నుంచి కూడా చైన్ లాక్కెళ్లేందుకు ప్రయత్నించి, విఫలం అయ్యారు. ఇక, చివరగా శ్రీనగర్ కాలనీకి చేరుకుని చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా, మహిళ మెడలో నుంచి చైన్ లాగే ముందు దుండగులు హిందీలో మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చైన్ స్నాచర్లు మహారాష్ట్రకు చెందిన వారుగా అనుమానిస్తున్నారు.
ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజీలను సేకరిస్తూ దొంగలను గుర్తించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నగరంలో చైన్ స్నాచింగ్ ఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానికులు, మహిళలలో భయాందోళన పెరుగుతోంది.
Nizamabad Road Accident | వేగంగా దూసుకెళ్లిన డెంటల్ విద్యార్థి.. కారు ఢీకొని చిన్నారి దుర్మరణం


[…] […]