ACB Raid | ఏసీబీ వలలో అటవీశాఖ అధికారులు.. రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటూ..

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ACB Raid | తెలంగాణ (Telangana)లో ఏసీబీ దూకుడు పెంచింది. అవినీతికి పాల్పడుతున్న అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకుంటోంది. ఇటీవల చాలా మంది అధికారులు అనిశాకు పట్టుబడ్డారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. ఏమాత్రం భయం లేకుండా లంచాలు తీసుకుంటున్నారు. తాజాగా.. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా దొరికారు.

ACB Raid | రూ. 10 లక్షలు డిమాండ్​

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District)లో బీటీ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా కొన్ని చెట్లు తొలగించారు. దీంతో కేసు నమోదు చేయకుండా ఉండడం కోసం భద్రాచలం అటవీశాఖ ఎఫ్​డీవో సుజాత రూ.పది లక్షలు డిమాండ్ చేశారు. అయితే ఈ క్రమంలో రూ. 3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు (ACB Officers) సుజాతతో పాటు చర్ల ఇన్​ఛార్జి డీఆర్వో కృష్ణయ్యను పట్టుకున్నారు.

ACB Raid | రోడ్డు పనులు చేస్తుండగా..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో రోడ్డు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో చెట్లు దెబ్బ తిన్నాయి. దీంతో ఎఫ్‌డీవో సుజాత రంగంలోకి దిగి చెట్లు తొలగించడంతో కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించారు. భద్రాచలం కార్యాలయంలో అటవీ అధికారులు రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది.

ఇది కూడా చదవండి..: Metro Phase 2 | మెట్రో ఫేజ్​–2కు ఆమోదం తెలపాలి.. కేంద్ర మంత్రిని కోరిన సీఎం

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *