May 08 Market Analysis | ఎరుపెక్కిన మార్కెట్లు.. నష్టాýతో ప్రారంభంకానున్న సెన్సెక్స్

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 08 Market Analysis | అమెరికా, ఇరాన్ ల మధ్య మళ్లీ ఘర్షణలు నెలకొనడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో గత సెషన్ లో వాల్ స్ట్రీట్(Wallstreet) నష్టాలతో ముగిసింది. దీని ప్రభావం ఆసియా మార్కెట్లపై కనిపిస్తోంది. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీనతను అనుసరించి దేశీయ స్టాక్ మార్కెట్ సైతం నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

May 08 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో ఎస్ అండ్ పీ 0.38 శాతం, నాస్‌డాక్ 0.13 శాతం నష్టపోయాయి. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.11 శాతం లాభంతో ఉంది.

May 08 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 1.57 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.19 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.03 శాతం క్షీణించాయి.

May 08 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. ఉదయం 7.45 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ (HangSeng)1.16 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.13 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.79 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.67 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.20 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.13 శాతం నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.52 శాతం నష్టంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు వరుసగా 3వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 340 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐ(DII)లు వరుసగా తొమ్మిదో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 441 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.19 నుంచి 1.08 కు తగ్గింది.
  • విక్స్ 0.34 శాతం తగ్గి 16.62 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 101.56 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 98.22 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.39 వద్ద ఉన్నాయి.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 37 పైసలు బలపడి 94.25 వద్ద ఉంది.

Meena Driverless Taxi | డ్రైవర్ లేని కారులో నటి మీనా ప్రయాణం.. వీడియో వైరల్!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *