Bus Stand Theft | ఆర్టీసీ బస్టాండ్​లో మహిళ బ్యాగ్ చోరీ..

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Bus Stand Theft | కామారెడ్డి బస్టాండ్ (Kamareddy bus stand) దొంగలకు అడ్డాగా మారుతోంది. బస్టాండ్​లో ఒంటరిగా ఉన్న మహిళలే టార్గెట్​గా చోరీలకు పాల్పడుతున్నారు. బస్సులో ఎక్కేందుకు నిలబడ్డ ప్రయాణికుల్లో కలిసిపోయి చోరీలకు తెగబడుతున్నారు.

Bus Stand Theft | కామారెడ్డి బస్టాండ్​లో..

తాజాగా కామారెడ్డి(Kamareddy) కొత్త బస్టాండ్​లో ఓ మహిళా ఉద్యోగి బ్యాగు చోరీకి గురైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. మేడ్చల్​కు చెందిన ఓ మహిళా ఉద్యోగి కామారెడ్డి పట్టణంలోని ఓ శుభకార్యం నిమిత్తం వచ్చింది. సాయంత్రం ఫంక్షన్ ముగించుకుని బస్టాండ్​లో ఆమె తన తల్లిని నిజామాబాద్ బస్​ ఎక్కిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె బ్యాగ్​ను దొంగిలించుకుని పారిపోయాడు. దొంగ పారిపోయాక గమనించిన మహిళ తన బ్యాగు చోరీకి గురైందని గుర్తించింది. వెంటనే సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా బస్టాండ్​కు చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ద్వారా విచారణ చేపడుతున్నారు. చోరీకి గురైన బ్యాగులో 5 తులాల బంగారు ఆభరణాలు, రూ.10వేల నగదు ఉన్నట్టు మహిళ తెలిపింది.

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *