Cisco Abhilash Reddy Package | రూ. 2 కోట్ల వార్షిక వేతనం సాధించిన తెలంగాణ తేజం

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cisco Abhilash Reddy Package | పాలమూరు జిల్లా అడ్డాకుల మండలం రాచాలకు చెందిన అభిలాష్ రెడ్డి అమెరికాలో రూ. 2 కోట్ల భారీ వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు.

అభిలాష్​ రెడ్డి తండ్రి యుగేందర్​ రెడ్డి (స్కూల్ అసిస్టెంట్), తల్లి శోభారాణి (డీఆర్డీవో సీనియర్ అసిస్టెంట్). పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో నారాయణ సంస్థ ఇంటర్మీడియట్‌లో ఉచితంగా విద్యను అందించింది.

Cisco Abhilash Reddy Package | ఐఐటీ గౌహతిలో సీటు

జేఈఈలో ప్రతిభ చూపి ఐఐటీ గౌహతిలో సీటు సాధించాడు. అలా 2018లో ఐఐటీ గౌహతిలో డేటా సైన్స్ పూర్తి చేశాడు. అనంతరం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో MS చేశాడు.

అక్కడ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కాలిఫోర్నియాలోని ప్రముఖ Cisco కంపెనీ ఏడాదికి రూ. 2 కోట్ల ప్యాకేజీతో అభిలాష్​ రెడ్డిని ఎంపిక చేసింది.

SPMCIL Jobs | కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌లో జాబ్స్..

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *