అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bandi Bhagirath | కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ వివాదంలో చిక్కుకున్నారు. తనను ఓ అమ్మాయి కుటుంబం హనీట్రాప్ చేసి.. రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారంటూ భగీరథ్ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో వైపు ఆయనపై పోక్సో చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు అందడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
Bandi Bhagirath | కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్‌లోని కొంపల్లికి చెందిన ఒక కుటుంబం తనను బ్లాక్‌మెయిల్ చేస్తోందని భగీరథ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. స్నేహితుల ద్వారా పరిచయమైన ఓ యువతితో తనతో స్నేహపూర్వకంగా ఉండేదని ఆ చొరవతోనే ఆమె కుటుంబ సభ్యులు తనను పార్టీలు, ఫంక్షన్లకు ఆహ్వానించేవారన్నారు. తామిద్దరం పలు ఆలయాలను కూడా సందర్శించామని ఎఫ్ఐఆర్‌లో రాశారు. అయితే సదరు యువతి తనను పెళ్లి చేసుకోవాలని, లేనిపక్షంలో రూ. 5 కోట్లు ఇవ్వాలని.. ఆమె కుటుంబం ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. వారి వద్ద ఉన్న వీడియోలు, చాటింగ్ స్క్రీన్ షాట్లతో వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన స్నేహితులకు కూడా గతంలో ఈ కుటుంబంతో ఇబ్బందులు ఎదురయ్యాయని.. వారిపై నిర్మల్ ఠానాలో ఫిర్యాదు కూడా ఉందని గుర్తు చేశారు.
Bandi Bhagirath | బాధితుడా? నిందితుడా?
ఈ ఘటనలో బండి సంజయ్ కుమారుడు బాధితుడా? లేక నిందితుడా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇది ప్లాన్ ప్రకారం చేసిన హనీ ట్రాప్ అని భగీరథ్ వాదిస్తుండగా.. మరోవైపు బాలికపై వేధింపుల ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.
మరోవైపు, మే 8న బాలిక కుటుంబ సభ్యులు భగీరథ్‌పై పలు ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక మైనర్ అని.. ఆమెపై భగీరథ్ అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు రెండు వైపుల ఫిర్యాదులను స్వీకరించి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో మరిన్ని నిజానిజాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..: Instagram Followers Drop | ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం.. ఒకేరోజు కోట్లలో ఫాలోవర్లు మాయం..

