Sand Tipper Accident | ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్.. పలువురికి గాయాలు

Shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Sand Tipper Accident | ఓవర్‌లోడ్‌తో అతివేగంగా వెళ్తున్న ఇసుక టిప్పర్ ఆర్టీసీ బస్సును (RTC Bus Accident) ఢీకొంది. దీంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వర్ని(varni) మండల కేంద్రంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Sand Tipper Accident | ఉద్రిక్త పరిస్థితులు..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బడా పహాడ్ (Badapahad) నుంచి వర్ని వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు మూలమలుపు వద్ద ఆగి ఉండగా, వర్ని నుంచి వేగంగా వస్తున్న ఇసుక టిప్పర్ అదుపుతప్పి బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొందరు సీట్లకు తగిలి గాయపడగా, మరికొందరికి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు(varni police) వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌ల సహాయంతో సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Sand Tipper Accident | రాకపోకలకు అంతరాయం..

ప్రమాదం కారణంగా కొంతసేపు రాకపోకలకు అంతరాయం కలగడంతో పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించారు. ప్రయాణికులు మాట్లాడుతూ.. బస్సు ఆగి ఉన్న సమయంలోనే టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొట్టిందని తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా వాహనం నడిపాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక టిప్పర్లు ఓవర్‌లోడ్‌తో వేగంగా నడపడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: West bengal | ‘ఎక్స్’ బయో మార్పుతో.. పరోక్షంగా ఓటమిని అంగీకరించిన దీదీ

 

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *