హైదరాబాద్Signal Free City| హైదరాబాద్‌కు త్రీ-లెవల్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Signal Free City| హైదరాబాద్‌కు త్రీ-లెవల్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

భాగ్యనగరాన్ని సిగ్నల్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది.

అక్షరటుడే వెబ్‌డెస్క్:Signal Free City|భాగ్యనగరాన్ని సిగ్నల్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. కేవలం రోడ్ల విస్తరణతోనే భవిష్యత్తు ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కావని భావిస్తున్న సర్కార్, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ‘త్రీ-లెవల్’ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. శనివారం తెలంగాణ సచివాలయంలో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు.

ఏమిటీ ‘త్రీ-లెవల్’ మేనేజ్‌మెంట్?
నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ రద్దీని పూర్తిగా తొలగించేందుకు మూడు అంచెల్లో రవాణా వ్యవస్థను నిర్మించనున్నారు.

  • అండర్‌పాస్‌లు: భూగర్భ మార్గాల ద్వారా వాహనాల రాకపోకలు.
  • సర్ఫేస్ రోడ్లు: ఉపరితల స్థాయిలో సాధారణ ప్రయాణం.
  • ఎలివేటెడ్ కారిడార్లు: రహదారుల పైభాగంలో నిర్మించే ఫ్లైఓవర్లు, కారిడార్లు.

Signal Free City|మల్టీ-మోడల్ రవాణా వ్యవస్థ..

ట్రాఫిక్ నియంత్రణపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. “రోడ్ల వెడల్పు పెంచడం ఒక్కటే పరిష్కారం కాదు. పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇంటిగ్రేటెడ్ అర్బన్ మొబిలిటీ , మల్టీ-మోడల్ రవాణా వ్యవస్థలపై దృష్టి సారిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ను పూర్తిస్థాయిలో సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

Signal Free City|సచివాలయంలో పార్లమెంటరీ కమిటీ భేటీ..

హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం కమిటీ ఛైర్మన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ భేటీలో ముఖ్యమంత్రితో పాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నగర మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై ఈ సందర్భంగా చర్చించారు. నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, రాబోయే రెండు మూడు దశాబ్దాల అవసరాలను గుర్తించి ఈ మల్టీ-మోడల్ రవాణా వ్యవస్థను రూపొందిస్తున్నారు. తద్వారా ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, ఇంధన పొదుపు , పర్యావరణ కాలుష్య నివారణ సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

 

ఇది కూడా చదవండి: West bengal | ‘ఎక్స్’ బయో మార్పుతో.. పరోక్షంగా ఓటమిని అంగీకరించిన దీదీ

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Migrant Worker Verification | ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితో జాగ్రత్త..: సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Migrant Worker Verification | ఉపాధి కోసం...

Vijay Tamil Nadu|మేజిక్ ఫిగర్ దాటేసిన టీవీకే.. సీఎం పీఠం దిశగా దళపతి!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Vijay Tamil Nadu|తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం...

Kailasagiri Trishul | కైలాసగిరిపై భారీ త్రిశూలం.. వైజాగ్ టూరిజానికి మరో కొత్త ఆకర్షణ!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Kailasagiri Trishul | సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుగాంచిన...

TVK Vijay | విజయ్‌కి సీఎం కుర్చీ దక్కినా.. ముందున్నది ముళ్లబాటేనా?

అక్షరటుడే, వెబ్​డెస్క్​: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్ (TVK Vijay)...