Youth Congress Presidents | యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Youth Congress Presidents | కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు యూత్ కాంగ్రెస్ (Congress Party) అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు యూత్ కాంగ్రెస్ (Youth Congress) జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారు.

Youth Congress Presidents | అధిష్టానం ఆదేశాల మేరకు..

ఏఐసీసీ యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్​ఛార్జి సయ్యద్ ఖాలిద్ అహ్మద్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు(Mandal President) చేపట్టినట్టు మధుసూదన్​ రెడ్డి తెలిపారు. కామారెడ్డి(Kamareddy Congress) అధ్యక్షుడిగా అజ్మత్, కామారెడ్డి మండల అధ్యక్షుడిగా హన్మాండ్ల రాంకుమార్, భిక్కనూరు మండల అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్, రాజంపేట అధ్యక్షుడిగా టి.ప్రభాకర్ గౌడ్, బీబీపేట అధ్యక్షుడిగా ఎం.మహేష్, దోమకొండ అధ్యక్షుడిగా పిన్నం నాగేంద్ర వర్మ, పాల్వంచ అధ్యక్షుడిగా సమరసింహా రెడ్డి, మాచారెడ్డి అధ్యక్షుడిగా రాజారెడ్డిలను (Political Appointments) నియమించడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా నియామకమైన అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, యువతను ఏకం చేస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర నాయకత్వం, జిల్లా ఇన్​ఛార్జీల పర్యవేక్షణలో వీరంతా సమన్వయంతో పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి తోడ్పడతారన్నారు.

ఇది కూడా చదవండి: India MIRV Missile|ఒకే క్షిపణి.. ఎన్నో లక్ష్యాలు.. రక్షణ రంగంలో భారత్ సరికొత్త చరిత్ర.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *