Inter Admissions | య‌థావిధిగా ఇంట‌ర్ అడ్మిష‌న్లు.. సీఎం కీలక ఆదేశాలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inter Admissions | ఇంటర్​ ప్రవేశాలపై సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది య‌థావిధిగా అడ్మిషన్లు చేపట్టాలని సూచించారు. పాఠశాల విద్యలో ఇంటర్​ విలీనంపై ఆయన సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో ఇంటర్​ బోర్డు (Inter Board), పాఠశాల విద్యను విలీనం చేస్తామని గతంలో సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఇంటర్​ ప్ర‌వేశాల‌కు స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌డం, విలీనం చేసే ప్ర‌క్రియ‌కు ప‌లు సాంకేతిక స‌మ‌స్య‌లు అడ్డుగా ఉండ‌డంతో విద్యార్థుల ప్ర‌యోజనాల‌కు భంగం వాటిల్ల‌కుండా వెంట‌నే ప్ర‌వేశాల ప్ర‌క్రియ‌ను చేప‌ట్టాల‌ని సీఎం సూచించారు. కాగా ఇంటర్​ను ర‌ద్దు చేసి సీబీఎస్ఈలో మాదిరే 11, 12 త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని.. ఫ‌లితంగా డ్రాపౌవుట్స్ సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంద‌ని తెలంగాణ ఎడ్యుకేష‌న్ క‌మిష‌న్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి సూచించింది.

Inter Admissions | రాష్ట్రంలో వేరుగా..

సీబీఎస్ఈ (CBSE)తో పాటు మెజారిటీ రాష్ట్రాలు 11, 12 త‌ర‌గ‌తుల విధానాన్ని అనుస‌రిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం 10+2 విధానం అమలులో ఉంది. దీంతో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివిన విద్యార్థుల్లో చాలా మంది ఆ త‌ర్వాత చదువును ఆపేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్మీడియ‌ట్‌ను వేరుగా కాకుండా 11, 12 త‌ర‌గ‌తులుగా కొన‌సాగించాల‌ని ముఖ్య‌మంత్రి గ‌తంలో అధికారుల‌కు సూచించారు. దీంతో ఇటీవ‌ల ఇంట‌ర్మీడియ‌ట్‌లో ప్ర‌వేశాలు నిలిపివేస్తూ అధికారులు ప్ర‌క‌ట‌న విడుదల చేయ‌డంతో విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల నుంచి ఆందోళ‌న వ్య‌క్త‌మైంది.

Inter Admissions | సాంకేతిక సమస్యలతో..

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శేషాద్రి, సీఎం స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ అజిత్ రెడ్డి, సీఎం సెక్ర‌ట‌రీ మాణిక్ రాజ్‌, విద్యా శాఖ క‌మిష‌న‌ర్ యోగితా రాణాల‌తో ఆదివారం చ‌ర్చించారు. విలీనంతో ముడిప‌డిన ప‌లు సాంకేతిక స‌మ‌స్య‌లను అధ్య‌య‌నం చేయాల్సి ఉన్నందున ఈ ప్ర‌క్రియ‌ను తాత్కాలికంగా వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించారు. విలీన‌ ప్ర‌క్రియ‌కు సంబంధించి భాగ‌స్వాముల‌తో విస్తృతంగా సంప్ర‌దింపులు నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఈ అంశంపై ఎడ్యుకేష‌న్ పాల‌సీపై నియ‌మించిన క‌మిటీ అధ్య‌య‌నం చేసి త‌న నివేదిక స‌మ‌ర్పించాల‌ని సీఎం సూచించారు. అనంత‌రం శాస‌న‌స‌భ‌లో చ‌ర్చించి తుది నిర్ణ‌యం తీసుకుంటామన్నారు.

దీనిని కూడా చదవండి : SPMCIL Jobs | కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌లో జాబ్స్..

 

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *